లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
Tue Jun 10, 2025 16:40 India.202506105258.jpg)
అన్నదాతలకు ముఖ్యమైన అలర్ట్. ప్రభుత్వం డబ్బులు అకౌంట్లలో జమ చేయడానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలో ప్రాథమికంగా ఒక జాబితాను కూడా రూపొందించింది. ఈ లిస్ట్‌లో పేరు ఉన్న వారికే డబ్బులు లభించే అవకాశం ఉంటుంది. అందువల్ల రైతులు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. లిస్ట్‌లో పేరు ఉందా? లేదా? అని చెక్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఇప్పుడు ఈ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. అన్నదాతలకు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు జమ కానున్నాయి. ఈ క్రమంలో రైతుల ప్రాథమిక జాబితా రూపొందించారు. తాజాగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 3,19,338 మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. అయితే ఇదే ఫైనల్ లిస్ట్ కాదు. ఈ సంఖ్య తుది స్థాయిలో మారొచ్చు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా జాబితా పరిశీలన కొనసాగుతోంది. తుది జాబితా వచ్చిన అనంతరం లబ్ధిదారులంతా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అనంతరం వారికి నేరుగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం జమ కానుంది. ఇటీవల వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా అర్హత కలిగిన రైతులను గుర్తించేందుకు గ్రామ స్థాయిలో పరిశీలన చేపట్టారు.
ఇది కూడా చదవండి: గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల అడ్మిషన్లు! మంత్రి పొన్నం కు విజ్ఞప్తి!
ఇందులో భాగంగా గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న డాక్యుమెంట్ల ఆధారంగా మొత్తం 3,19,666 మంది రైతులను ప్రాథమికంగా ఎంపిక చేశారు. పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు వార్షికంగా రూ.20,000 సాయం అందించనున్నట్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనను సూపర్ సిక్స్ ప్రణాళికలో భాగంగా ప్రకటించగా, ఇప్పుడు దాన్ని అమలు పరిచేందుకు ప్రక్రియ వేగంగా సాగుతోంది. అన్నదాత సుఖీభవ పథకం కింద మూడు విడతల్లో సాయాన్ని అందించనున్నారు. ఇందులో పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్రం నుండి రూ.6,000 లభించనుండగా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.14,000 జమ చేయనుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో అందిస్తారు. మొదటి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.5,000 వేలు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. రెండో విడత కింద మరో రూ.5,000 డబ్బులు అందిస్తుంది. ఇక మూడవ విడత కింద రూ.4,000 డబ్బులు వస్తాయి. ఈ విధంగా మొత్తం రూ.20,000 సాయం లభించనుంది.
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు శుభవార్త! డిగ్రీ అర్హతతో భారీ నోటిఫికేషన్! చివరి తేదీ...
ఈ నెలలోనే పీఎం కిసాన్ రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ రూ.5 వేలు రైతులకు లభించనున్నాయి. రైతులకు ఆర్థికంగా బాసటగా నిలవడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తోంది. అర్హత కలిగిన ప్రతి రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే ఈకేవైసీ పూర్తిచేయడం తప్పనిసరి. వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించే కుటుంబాలకు ఈ పథకం కింద చాలా మేరకు ప్రయోజనం పొందే ఛాన్స్ ఉంటుంది. అర్హత కలిగిన రైతుల జాబితా అనేది జిల్లా వ్యవసాయ శాఖకు వచ్చిన తరువాత లబ్ధిదారులతో ఈకేవైసీ చేయించొచ్చు. అప్పుడు వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది. జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి మాట్లాడుతూ.. లబ్ధిదారుల జాబితా రాగానే ఈ-కేవైసీ పూర్తి చేయిస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!
పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!
సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!
బాలయ్యకు చంద్రబాబు బర్త్‌డే విషెస్! సోషల్ మీడియా వేదికగా..
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..
జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..
కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..
సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!
పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..
జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!
ఆ 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!
అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #andhrapradesh #annadatha #sukhi #bhava #7000rs #framers #ap #chandrababu #naidu
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.